![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఫైనల్ కి ఇంకో మూడు వారాలే మిగిలి ఉండటంతో కంటెస్టెంట్స్ ఆటతీరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఇక నిన్నటిదాకా నామినేషన్లు.. నేటి నుండి టికెట్ టు ఫినాలే రేస్.. ఇక ఈ వారం బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగే.
ఇక పన్నెండో వారం నామినేషన్లని భిన్నంగా చేసిన బిగ్ బాస్.. పదమూడో వారం జరుగుతున్న టికెట్ టు ఫినాలేని పాత కంటెస్టెంట్స్ తో జరిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. ఇందులో ఏం ఉందంటే.. బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్, దేత్తడి హారిక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే.. టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌ని ఈ సీజన్ 4 ఫైనలిస్ట్‌లు తేల్చబోతున్నారు. వీరితో పాటు.. మానస్, ప్రియాంక ఇలా చాలామంది హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక ప్రోమోలో అఖిల్ సార్థక్, దేత్తడి హారిక కలిసి ఓ టాస్క్ ఆడించారు. రోహిణిని చూసి.. నువ్వు నిజంగానే శివంగి అంటూ ఆమె ఆటపై పొగడ్తలు కురిపించాడు అఖిల్. ఇక పృథ్వీని చూసి.. ‘ఏంటి బ్రో.. నీ ఫొటో నా ఫొటో వేసి.. ట్రోల్ చేస్తున్నారు జనాలు’ అని అన్నాడు. ఆ తరువాత టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయ్యింది.
గౌతమ్, తేజా, రోహిణి, విష్ణు ప్రియ ఈ టాస్క్ లో పాల్గొనగా.. రోహిణి విజృంభించి ఆడింది. దాంతో టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది. నువ్వు ఆడలేవు.. గెలవలేవని హేళన చేసిన వాళ్లకి మరోసారి తన గెలుపుతో సమాధానమిచ్చింది రోహిణి. ఇప్పటి వరకు జరిగిన అన్నీ సీజన్లలో ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నామినేషన్లోకి రాకుండా టికెట్ టు ఫినాలేకి రావడం ఇదే తొలిసారి. ఆ ఫీట్ కి మరో అడుగుదూరంలో నిలిచింది రోహిణి.
![]() |
![]() |